మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2020-12-04T03:40:37+05:30 IST

మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధికా ప్రాధాన్యం ఇస్తోందని కొత్తగూడెం శాసన సభ్యుడు వనమా వెంకటేశ్వరరావు అన్నారు.

మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే వనమా

కొత్తగూడెం శాసన సభ్యుడు వనమా 

చుంచుపల్లి, డిసెంబరు 3: మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధికా ప్రాధాన్యం ఇస్తోందని కొత్తగూడెం శాసన సభ్యుడు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఎన్‌ఏసీ). తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పోరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో 20 మంది మైనార్టీ మహిళలకు సుమారు రూ.2లక్షలు విలువచేసే మిషన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మైనార్టీలకు అండగా ఉంటామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ మహిళల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమ లు చేస్తుందని గుర్తుచేశారు. అందులో భాగంగా ‘నాక్‌’ (ఎన్‌ఏసీ) ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషన్‌లో శిక్షణ ఇస్తూ ధృవీకరణ పత్రాలు, కుట్టు మిషన్‌లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని మైనార్టీ మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మీ, జిల్లా మైనార్టీ శాఖ అధికారి పులిరాజు, నాక్‌ సభ్యులు హెప్సిబా, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేంద్రరావు, కౌన్సిలర్‌ పల్లపు లక్ష్మణ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎంఏ.రజాక్‌, కాసుల వెంకట్‌, ఆరిఫ్‌ ఖాన్‌, రాంబాబు, గణేష్‌, చింత నాగరాజు, శ్రీధర్‌, రమా కాంత్‌, మైనార్టీ కార్పొరేషన్‌ అధికారులు, మైనార్టీ మహిళ లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-04T03:40:37+05:30 IST