‘వనమా రాఘవను కఠినంగా శిక్షించాలి’

Published: Thu, 06 Jan 2022 23:59:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వనమా రాఘవను కఠినంగా శిక్షించాలి నిరసన తెలుపుతున్న ఐద్వా నాయకులు

భద్రాచలం, జనవరి 6: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసేందుకు కారణమైన టీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవను కఠినంగా శిక్షించాలని ఐద్వా పట్టణ అధ్యక్షురాలు జ్యోతి డిమాండ్‌ చేశారు. భద్రాచలంలో గు రువారం జరిగిన సమావేశంలో పట్టణ కార్యదర్శి డి.సీతాలక్ష్మి మాట్లాడుతూ వనమా రాఘవపై రౌడీషీట్‌ తెరవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నాదెళ్ల లీలావతి, సున్నం గంగ, ఆఫీసు బేరరు జి.జీవనజ్యోతి, ఎ.సక్కుబాయి పాల్గొన్నారు.

వనమా రాఘవను కఠినంగా శిక్షించాలి: ఎన్డీ

మణుగూరు, జనవరి 6:  మీ సేవా నిర్వాహకుడు రా మకృష్ణ కుటుంబంలోని నలుగురు మృతికి కారకుడైన కొ త్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎన్డీ సబ్‌డివిజన్‌ నాయకులు రవి, డిమాండ్‌ చేశారు. గు రువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వన మా రాఘవపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జగ్గన్న, రాము పాల్గొన్నారు.

రాఘవ లాంటి నిందితులకు సహకరించకండి

అధికారం, అంగబలం ఉందన్న అహాంకారంతో మ హిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఇ ష్టారాజ్యాంగా వ్యవహారించే వనమా రాఘవ లాంటి నిం దితులకు ఎవరూ సహాకరించకూడదని టీఆర్‌ఎస్‌ మాజీ రాష్ట్ర కార్యదర్శి చింతలపూడి వెంకట రెడ్డి అన్నారు. ఆ యన గురువారం ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. రా మకృష్ణ, అతడి కుటుంబ సభ్యుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరగా లంటే వనమా రాఘవతో పాటు మరో ఇదరు నింది తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో మరెందరో ఉన్నారని, వారిని కఠి నంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

దమ్మపేట, జనవరి 6: పాల్వంచ పట్టణానికి చెందిన రామకృష్ణ కుంటుంబాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ పార్టీ కో-కన్వీనర్‌ సోయం వీరభద్రం డిమాండ్‌ చేసారు. దమ్మపేట లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతు రామకృష్ణ కుంటంభం ఆత్మహత్య కు పాల్పడటం చాలాబాధాకరమని ఇలాంటి ఘటనలు మరోసారి పునారావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు.సమావేశంలో శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ ఘంటా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ఖమ్మం Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.