భద్రాచలం సబ్‌జైలుకు వనమా రాఘవ తరలింపు

ABN , First Publish Date - 2022-01-09T02:00:46+05:30 IST

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పాల్వంచ నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టయిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

భద్రాచలం సబ్‌జైలుకు వనమా రాఘవ తరలింపు

 భద్రాచలం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పాల్వంచ నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టయిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను శనివారం భద్రాచలం ప్రత్యేక సబ్‌జైలుకు రిమాండ్‌ నిమిత్తం తరలించారు. రాఘవను పాల్వంచ పోలీసులు కొత్తగూడెంలో న్యాయమూర్తి ఎదుట శనివారం ఉదయం హాజరుపరుచగా న్యాయమూర్తి రాఘవకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో  పోలీసులు ప్రత్యేక బందోబస్తు మధ్య రాఘవను భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు. అనంతరం జైల్లో రాఘవకు రిమాండ్‌ ఖైదీ నెం.985 సంఖ్యను కేటాయించారు. ప్రత్యేక సబ్‌జైల్లోని బ్యారక్‌ నెం.1లో అతడిని ఉంచారు. వాస్తవానికి రాఘవను ఖమ్మం జిల్లా జైలుకు తరలించాల్సి ఉండగా ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో అతడిని భద్రాచలం ప్రత్యేక సబ్‌జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. త్వరలో మళ్లీ అతడిని ఖమ్మం జైలుకు  తరలిస్తారని ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2022-01-09T02:00:46+05:30 IST