వనస్థలిపురంలో శిశువు తల కలకలం

Published: Sun, 13 Mar 2022 17:25:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon

హైదరాబాద్: వనస్థలిపురంలో మొండెం లేని శిశువు తల కలకలం రేపింది. ఓ కుక్క గుర్తుతెలియని శిశువు తలను నోటకరిచి తీసుకువచ్చింది. దీన్ని గమనించిన ఓ వ్యక్తి కుక్కను తరమడంలో తలను అక్కడి వదలి వెళ్లిపోయింది. వనస్థలిపురంలోని సహార గేట్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పాల బూత్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. శిశువు తలను కుక్క ఎక్కడి నుంచి తీసుకువచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా చంపి తలను మొండాన్ని వేరు చేశారా? లేకపోతే నరబలి ఇచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.