
పెరంబూర్(చెన్నై): స్థానిక వండలూరు జూలో జంతువుల మరణాలు కొనసాగుతున్నాయి. తాజాగా జూలో ఓ ఆడ తెల్లపులి కన్ను మూసింది. 2009లో ఇదే జూలో జన్మించిన ఆకాంక్ష అనే ఆడపులి.. రెండు వారాలుగా ‘అటాక్సియా’ అనే కండరాల సమస్యతో బాధపడుతోంది. ఈ పులికి వెటర్నరీ వైద్యులు చికిత్స అందిస్తున్నా ఫలితం కానలేదు. రెండు రోజుల నుంచి ఆ పులి కనీసం ఆహారం కూడా తీసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ఆ పులి చనిపోయినట్లు జూ అధికారులు తెలిపారు. పులి కళేబరానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.
ఇవి కూడా చదవండి