
విజయవాడ (Vijayawada): వంగవీటి మోహనరంగా (Mohana Ranga) 75వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వంగవీటి నరేంద్ర (Narendra) పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో రంగా జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం రంగా పోరాటాలు చేశారని, పేదల కోసమే తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. రాధా, రంగా మిత్ర మండలి పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి