అమెరికాలో చరిత్ర సృష్టించిన వనితా గుప్తా

ABN , First Publish Date - 2021-04-22T15:12:35+05:30 IST

భారత సంతతికి చెందిన వనితా గుప్తా అమెరికాలో చరిత్ర సృష్టించారు. అసోసియేట్ అటార్నీ జనరల్‌గా నియామకం అయ్యారు. అగ్రరాజ్యం అమెరికాలో ఈ పదవిని చేపట్టనున్న శ్వేతజాతియేతర, తొలి భారత సంతతి మహిళగా వనితా గుప్తా రికార్డు నెలకొల్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత సంతతికి చెందిన వనితా గుప్తాను..

అమెరికాలో చరిత్ర సృష్టించిన వనితా గుప్తా

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన వనితా గుప్తా అమెరికాలో చరిత్ర సృష్టించారు. అసోసియేట్ అటార్నీ జనరల్‌గా నియామకం అయ్యారు. అగ్రరాజ్యం అమెరికాలో ఈ పదవిని చేపట్టనున్న శ్వేతజాతియేతర, తొలి భారత సంతతి మహిళగా వనితా గుప్తా రికార్డు నెలకొల్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత సంతతికి చెందిన వనితా గుప్తాను అసోసియేట్ అటార్నీ జనరల్‌గా నామినేట్ చేసిన నేపథ్యంలో ఆమె నియrమకానికి యూఎస్ సెనేట్ ఆమోద ముద్ర వేసింది. అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తాను నియమకాన్ని ధ్రువీకరించేందుకు సెనేట్‌లో ఓటింగ్ జరిగింది. ఈ క్రమంలో 51 ఓట్లతో ఆమె నియామకానికి సెనేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 100 మంది సభ్యులున్న యూఎస్ సెనేట్‌లో రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలకు సమాన బలాలు ఉన్నాయి. అయితే రిపబ్లికన్ పార్టీకి చెందిన లీసా మర్కోస్కీ వనితా గుప్తాకు అనుకూలంగా ఓటు వేయడంతో ఆమె నియామకానికి సెనేట్‌లో ఆమోదముద్ర పడింది. ఈ క్రమంలో స్పందించిన జో బైడెన్.. వనితా గుప్తాకు అభినందనలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో న్యాయ శాఖలోని పౌర హక్కుల విభాగంలో వనితా గుప్తా పని చేశారు. 

Updated Date - 2021-04-22T15:12:35+05:30 IST