వరద బాధితులకు దాతల సాయం

Nov 30 2021 @ 23:05PM
చిల్లకూరు: నక్కలకాలువకండ్రిగ గిరిజనకాలనీ పరిశీలిస్తున్న ఆర్డీవో మురళీకృష్ణ

గూడూరు, నవంబరు 30: వరద బాధితులకు మంగళవారం పలువురు దాతలు  ఆహార పొట్లాలను అంద జేశారు. సాయిసత్సంగ నిలయం నిర్వాహకుడు కోట సునీల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో 1,350, ఎస్వీ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు శ్రీకంఠి రామ్మోహన్‌రావు, వైసీపీ రాష్ట్రనాయకుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో 400, మందికి ఆహారపొట్లాలను అందించారు. అనిమెళ్ల శివకుమార్‌, శ్రీనివాసరావు పాల్గొన్నారు. రోటరీవెస్ట్‌క్లబ్‌ ఆధ్వర్యంలో రాఘవరెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణ, విజయభాస్కర్‌రెడ్డి, రామ్మోహన్‌రావు, చవట గిరిజన కాలనీలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెలబల్లి భాస్కర్‌ రెడ్డి, మల్లి శ్రీనివాసులు రెడ్డి, ధనుంజయరెడ్డి, ప్రజేంద్రరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి,  సీపీఎం కార్యాలయంలో ఇన్సాఫ్‌ కమిటీ ఆధ్వ ర్యంలో కమిషనర్‌ శ్రీకాంత్‌, శ్రామిక్‌నగర్‌ వాసులకు, జడ్పీ ఉన్నత పాఠశాలలోని పునరావాస కేంద్రంలో ప్రగతి సేవాసంస్థ ఆధ్వర్యంలో కడివేటి చంద్రశేఖర్‌, జీ చంద్రశేఖర్‌, రాము, శ్రీనివాసులు, సతీష్‌, ఇన్నర్‌వీల్‌క్లబ్‌, ఆంధ్ర మహిళా మండలి, రోటరీ క్లబ్‌ల ఆధ్వర్యంలో డాక్టర్‌ రోహిణి, జనార్దన్‌ రెడ్డి, బాలకృష్ణమ రాజు, అనిత, శశికళ, లక్ష్మి, హీరాబెన్‌ మాతాజీ గ్లోబల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు కంకణాల పెంచలనాయుడు ఆధ్వర్యంలో, బాస్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, కొరపాటి రవీంద్రబాబు ఆహారం పొట్లాలను పంపిణీ చేశారు.

నిరంతరం సహాయక చర్యలు 

కోట: ముంపు బాధితులకు ఆదుకుంటామని పేర్నాటి చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి మంగళ వారం తెలిపారు. వరద తగ్గేంత వరకు కోటలో  ఏర్పాటు చేసిన వంటశాలల్లో ఆహారం తయారుచేసి  జిల్లాల నలు మూలలకు తరలిస్తామన్నారు. ఉప్పుటేరు పొంగడంతో జలదిగ్బంధంలో చిక్కుకున్న యమదిన్నెపాళెం గున్నంపడియ, శ్రీనివాసాసత్రం గ్రామాల్లోని గిరిజన కుటుంబాలకు జడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రసాద్‌గౌడ్‌, సర్పంచ్‌ తిరుపాలయ్య, వీఆర్వో మస్తానయ్య ఆహారం పొట్లాలు పంపిణీ చేశారు. 

 సహాయ చర్యలు ప్రారంభం

చిల్లకూరు, నవంబరు 30: వరద బాధితులకు సహాయ చర్యలు ప్రారంభించామని ఆర్డీవో మురళీకృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని నక్కలకాలువ కండ్రిగ గిరిజన కాలనీని పరిశీలించి, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.  చింతవరం, తూర్పుకనుపూరు పునరావాస కేం ద్రాల్లో తలదాచుకున్న వారికి తహసీల్దారు రవీంద్రబాబు దుప్పట్లు పంపిణీ చేశారు.  మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ స్థానిక దళితవాడలో ఇళ్లను పరిశీలించారు. జాతీయ రహదారి పై ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో బూదనం గ్రామానికి చెందిన చిరంజీవి ఎంటర్‌ ప్రైజస్‌ యజమాని పసల చిరంజీవి ఆహార పొట్లాలను పంపి ణీ చేశారు.

ఆహారం పొట్లాలు పంపిణీ

వెంకటగిరి(టౌన్‌): వర్షం కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి కేఆర్‌పీఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్టు  అధినేత కలిమిలి రాంప్రసాద్‌ రెడ్డ్డి మంగళవారం ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉంటామన్నారు.


యమదిన్నెపాళెంలో పేదలకు ఆహారపొట్లాలు అందజేస్తున్న ప్రసాద్‌గౌడ్‌, వీఆర్వోలు


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.