ఈ వారం వివిధ కార్యక్రమాలు 03-07-2022

ABN , First Publish Date - 2022-07-04T06:32:05+05:30 IST

‘బాలి కథలు’ పుస్తకావిష్కరణ తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు ‘శబ్ద్‌ కే పరే’...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 03-07-2022

‘బాలి కథలు’ పుస్తకావిష్కరణ

మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో చిత్రకారులు, కథకులు బాలి రాసిన కథా సంపుటి ‘బాలి కథలు’ పుస్తకానిష్కరణ సభ విజయవాడ ఠాగూర్‌ స్మారక గ్రంథాలయంలో జులై 10న ఆదివారం ఉదయం 10 గంటలకు జరుగుతుంది. తెలుగు ్క్ష సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. సాహితీవేత్త గుమ్మా సాంబ శివరావు అధ్యక్షత వహిస్తారు. సభలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ మందపాటి శేషగిరిరావు,  కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ శ్రీమతి టి. జమల పూర్ణమ్మ, తూములూరి రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొంటారు.

కలిమిశ్రీ


‘శబ్ద్‌ కే పరే’ 

వి. వెంకటేశ్వర హిందీ హైకూ పుస్తకం ‘శబ్ద్‌ కే పరే’ ఆవిష్కరణ సభ జూలై 10 సాయంత్రం 5 గంటలకు జూమ్‌ అంతర్జాల వేదికలో జరుగుతుంది. ఐడి: 882 8810417, పాస్‌వర్డ్‌: 123 456. సభాధ్యక్షులు: సోమే పల్లి వెంకట సుబ్బయ్య, పుస్తక ఆవిష్కర్త: గుమ్మా సాంబశివరావు సమీక్షకులు: పేరిశెట్టి శ్రీనివాసరావు.

చలపాక ప్రకాష్‌


తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు

2019 సంవత్సరానికి తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాల ప్రదా నోత్సవం జూలై 7 మధ్యాహ్నం 2.30 గంటలకు ఎన్‌టిఆర్‌ కళా మందిరం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ లో జరుగుతుంది. సభాధ్యక్షులు: తంగెడ కిషన్‌ రావు, ముఖ్య అతిథి ఆర్‌. లింబాద్రి, విశిష్ట అతిథి: నందిని సిధారెడ్డి. 

2019 సాహితీ పురస్కారాల వివరాలు: యం. పురుషోత్త మాచార్య పద్య కవిత ‘రహస్య భూతము’, కృష్ణుడు వచన కవిత ‘ఆకాశం కోల్పోయిన పక్షి’, యం. కృష్ణకుమారి బాల సాహిత్యం ‘ఈ అడవి మాది’, సిద్దెంకి యాదగిరి కథ/కథానిక ‘తప్ష’, రామాచంద్రమౌళి నవల ‘కాలనాళిక’,  జి.చెన్నకేశవరెడ్డి సాహిత్య విమర్శ ‘అక్షరన్యాసం’, చిటిప్రోలు వేంకటరత్నం నాటకం ‘అశోకపథం’, టంకశాల అశోక్‌ అనువాదం ‘రాధాకృష్ణన్‌ జీవిత చరిత్ర’, జయరాజు వచన రచన ‘అవని’, అనురాధ సుజలగంటి ‘అమ్మ బంగారు కల’.  

భట్టు రమేష్‌


తల్లి/ అవ్వపై కవితలు

‘బహుజన అవ్వ’ కవితా సంకలనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి, మైనార్టీ (బహుజన) కవులు తల్లి/ అవ్వ మీద కొత్తగా రాసిన కవితలను వెంటనే లేదా పది రోజుల లోపు చిరునామా: అన్వర్‌, కరీమా మంజిల్‌, 5-3-162, సిటిజెన్‌ ఫంక్షన్‌ హాల్‌ పక్కన, ఈద్గాహ్‌ రోడ్‌, హన్మకొండ జిల్లా- 506001కు పంపాలి. వివరాలకు ఫోన్‌: 98660 89066. 

అన్వర్‌


Updated Date - 2022-07-04T06:32:05+05:30 IST