ఈ వారం వివిధ కార్యక్రమాలు 13-06-2022

ABN , First Publish Date - 2022-06-13T05:37:56+05:30 IST

చెరబండరాజు సమగ్ర సర్వస్వం భైరవయ్య కథలు ‘కిష్టడి కతలు’ ఆవిష్కరణ..

ఈ వారం వివిధ కార్యక్రమాలు 13-06-2022

చెరబండరాజు సమగ్ర సర్వస్వం

చెరబండరాజు సాహిత్య సర్వస్వాన్ని అల్లం రాజయ్య సంపాదకత్వంలో రెండు సంపుటాలుగా వి.ర.సం. పునర్ముద్రిస్తోంది. జూలై 3న హైదరాబాద్‌ సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో ‘చెర’ 40వ వర్ధంతి, విరసం ఆవిర్భావ సభలో వీటిని ఆవిష్కరిస్తారు. వీటిని ప్రీ ఆర్డరులో తక్కువ ధరకే పొందగోరిన వారు ఫోన్‌: 92472 53884లో సంప్రదించవచ్చు. 

రివేరా


భైరవయ్య కథలు

‘గలగలా గోదారి’ శీర్షికన వచ్చిన బైరవయ్య కథలను ప్రచురించదలిచాం. వారి వారసుల వివరాలు తెలియ లేదు. ఈ కథల ప్రచురణ విషయమై ఎవరికయినా అభ్యంతరం ఉంటే తెలియజేయాలని కోరుతున్నాం. వివరాలకు ఫోన్‌: 9440343479.

ఎన్‌.కె. బాబు 


‘కిష్టడి కతలు’ ఆవిష్కరణ

‘ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం’ ఆధ్వర్యంలో ఆర్‌.సి.కృష్ణస్వామిరాజు రచన ‘కిష్టడి కతలు’ ఆవి ష్కరణ సభ జూన్‌ 19 ఉ.10గం.లకు విజయ వాడలోని ప్రెస్‌క్లబ్‌లో జరుగనున్నది. సభలో సోమేపల్లి వెంకట సుబ్బయ్య, కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌, శ్రీకంఠస్ఫూర్తి, వైష్ణవిశ్రీ తదితరులు పాల్గొంటారు.

చలపాక ప్రకాష్‌


Updated Date - 2022-06-13T05:37:56+05:30 IST