ఈ వారం వివిధ కార్యక్రమాలు 20-06-2022

ABN , First Publish Date - 2022-06-20T06:05:32+05:30 IST

‘మనిషిని కలిసినట్టుండాలి’, ‘నిరంతర’ గ్రంథాల ఆవిష్కరణ కొమర్రాజు, గిడుగులపై పరిశోధన రచనలకు ఆహ్వానం...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 20-06-2022

‘మనిషిని కలిసినట్టుండాలి’, ‘నిరంతర’ గ్రంథాల ఆవిష్కరణ

ఎన్‌. గోపి 73వ జన్మదినం సందర్భంగా జూన్‌ 26 సా.5గం.లకు, హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ‘మనిషిని కలిసినట్టుండాలి’ కవితా సంపుటి, ఎస్‌. రఘు సంపాదకత్వంలో వెలువడే సాహిత్య విమర్శ, సమీక్షావ్యాసాల ప్రత్యేక గ్రంథం ‘నిరంతర’ గ్రంథాల ఆవిష్కరణ జరుగుతుంది. సభలో వంగల హర్షవర్థన్‌, కె. రామచంద్రమూర్తి, సూర్యా ధనంజయ్‌, వోలేటి పార్వతీశం తదితరులు పాల్గొంటారు. 

మద్దాళి రఘురాం


కొమర్రాజు, గిడుగులపై పరిశోధన రచనలకు ఆహ్వానం

వ్యవహారిక భాషోద్యమ రథసారథులు కొమర్రాజు లక్ష్మణరావు, గిడుగు రామ్మూర్తి పంతులు గార్ల జీవిత సాహిత్యాలపై ఉత్తమ పరిశోధనకూ, పరిశీలనకూ పురస్కారం ఇవ్వదలిచాము. మీ పరిశోధనా, పరిశీలనా వివరాలతో పాటు బయోడేటాను ఈమెయిల్‌ :srisailaputrinadh@gmail.com కు పంపాలి. ఉత్తమ రచనకు రూ.50వేల నగదుతో పాటు, స్వర్ణకంకణం, జ్ణాపికఆగష్టులో జరిగే కార్యక్రమంలో ఇస్తాం. రచనలు పంపే చివరి తేదీ, జూన్‌ 25.

శ్రీశైలపు త్రినాధ్‌


వేదగిరి రాంబాబు కథానిక పురస్కారం

వేదగిరి రాంబాబు స్మారక కథానిక పురస్కారానికి అక్టోబరు 14, 2022 నాటికి నలభై ఏళ్లు మించని రచయితల నుంచి కథానికా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. పురస్కారంగా రూ.5వేల నగదు, జ్ఞాపిక ఇస్తాం. పుస్తకాలను ఆగస్ట్‌ 14 లోపు చిరునామా: సిహెచ్‌. శివరామ ప్రసాద్‌ (వాణిశ్రీ), స్వగృహ అపార్టుమెంట్స్‌, సి బ్లాక్‌, ఎఫ్‌ 2, భాగ్యనగర్‌ కాలనీ, హైదరాబాద్‌ - 500072, ఫోన్‌: 9849061668కు పంపాలి.

సింహప్రసాద్‌

Updated Date - 2022-06-20T06:05:32+05:30 IST