
విజయవాడ: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘‘సామాజిక న్యాయం, సంక్షేమంపై బహిరంగ చర్చకు ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) సవాల్ విసిరారు. దీనికి మీరు సిద్ధమైతే వేదిక ఏర్పాటు చేయండి’’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah) శుక్రవారం ట్వీట్ (Tweet) చేశారు. ‘‘బహిరంగ చర్చకు సిద్ధమైతే సమయం తెలియజేయండి. మా పార్టీ తరపున ఇద్దరం వస్తాం. మీ తరపున ఇద్దరు మంత్రులను పంపండి. న్యాయ నిర్ణేతలుగా ఇద్దరు విశ్రాంత ఐఏఎస్‌లుంటారు. మీరు సిద్ధమా?’’ అని వర్ల రామయ్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి