Nepal Casino: వైసీపీ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు జీవం పోస్తోంది: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2022-07-28T21:38:04+05:30 IST

వైసీపీ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు జీవం పోస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ధ్వజమెత్తారు.

Nepal Casino: వైసీపీ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు జీవం పోస్తోంది: వర్ల రామయ్య

అమరావతి: వైసీపీ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు జీవం పోస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ధ్వజమెత్తారు. మాజీమంత్రి కొడాలి నాని (Kodali Nani), ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) నేతృత్వంలోనే.. చికోటి ప్రవీణ్‌ గుడివాడలో కెసీనో నిర్వహించారని ఆరోపించారు. నేపాల్ కెసీనోకు వెళ్లినవారిలో సగం మంది వైసీపీ నేతలేనని వెల్లడించారు. వైసీపీ (YCP) ప్రభుత్వానికి నేపాల్ కెసీనోకు వెళ్లిన.. ప్యాసింజర్స్ లిస్టు బయటపెట్టే ధైర్యం ఉందా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. వైసీపీ (YCP) నేతల ఇళ్లల్లోనూ ఈడీ సోదాలు జరపాలని డిమాండ్ చేశారు. కెసీనో ద్వారా కొడాలి నాని, వల్లభనేని వంశీ.. ఏ వ్యాపారాలు చేస్తున్నారో త్వరలో బయటపెడతానని వర్ల రామయ్య ప్రకటించారు.

Updated Date - 2022-07-28T21:38:04+05:30 IST