
అమరావతి: సీఐడీ అడిషనల్ డీజీకి టీడీపీ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) లేఖ రాశారు. టీడీపీ నేతల సోషల్మీడియా అకౌంట్లు హ్యాక్ చేసి.. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఆన్లైన్ బెదిరింపులు, ఫోర్జరీలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు రాజకీయ వర్గాల మధ్య గొడవలు పెట్టాలని, వైసీపీ మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారని వర్ల రామయ్య లేఖలో ప్రస్తావించారు.