రేవతి హారర్ మూవీని ప్రశంసించిన వర్మ

Published: Mon, 24 Jan 2022 15:46:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రేవతి హారర్ మూవీని ప్రశంసించిన వర్మ

ఇటీవల సోనీ లివ్ ఓటీటీలో విడుదలై.. ప్రశంసలు అందుకుంటున్న మలయాళ హారర్ చిత్రం ‘భూతకాలం’. షేన్ నిగమ్, రేవతి ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాను ఎంతో సహజంగా తెరకెక్కించాడు దర్శకుడు రాహుల్ సదాశివన్. అన్వర్ రషీద్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో తల్లి, కొడుకుల పాత్రలే ప్రధానంగా ఉంటాయి. తన కుటుంబ సభ్యుణ్ణి కోల్పోయిన అనంతరం ఆ ఇంట్లో తల్లి, కొడుకులకు భయానకమైన సంఘటనలు ఎదురవుతాయి. అవి వారి నిజజీవితాన్ని, వివేకాన్ని ప్రశ్నిస్తాయి. కొడుకుగా షేన్ నిగమ్, తల్లి గా రేవతి అద్భుతంగా నటించిన ఈ సినిమాను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలే వీక్షించారు. సినిమాను ఓ రేంజ్ లో పొగుడుతూ ట్వీట్ చేశారు. 


‘ఎక్జార్సిస్ట్ తర్వాత ‘భూతకాలం’ అనే మలయాళ చిత్రం కన్నా వాస్తవికమైన హారర్ మూవీని మళ్ళీ చూడలేదు. షేన్ నిగమ్, రేవతిల అద్భుతమైన నటన, ఇలాంటి సినిమాతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన దర్శకుడు రాహుల్ సదాశివన్ కు, నిర్మాత అన్వర్ రషీద్ కు అభినందనలు’.. అని చిత్రాన్ని ఆకాశానికెత్తేస్తూ సినిమా ట్రైలర్ ను షేర్ చేశారు వర్మ. ‘రాత్రి’ మూవీతో రేవతిని భయానకంగా ఎలివేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ .. ఇప్పుడు ఆమె నటించిన మరో హారర్ మూవీని ప్రశంసల్లో ముంచెత్తడం ఆసక్తిని రేపుతోంది.  


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International