Advertisement

తలైవికి పోటీగా శశికళ.. వర్మ లైన్‌లోకొచ్చాడు

Nov 21 2020 @ 22:18PM

కొద్ది రోజులుగా వర్మ హడావుడి కాస్త తగ్గిందనే చెప్పుకోవాలి. లాక్‌డౌన్‌ సమయంలో అర్థంపర్థంలేని సినిమాలతో జనాలను విసిగించిన వర్మ.. ఈ మధ్యలో 'దిశ' విషయమై కోర్టులో కాస్త గందరగోళం నెలకొనడంతో.. వార్తల్లో నిలిచాడు. మళ్లీ ఎవరు నిద్రలేపారో గానీ.. తను ఎప్పుడో ప్రకటించిన ఓ బయోపిక్‌ని లైన్‌లో పెట్టేందుకు లైన్‌లోకి వచ్చేశాడు. అలా వచ్చాడో లేదో.. వరుస ట్వీట్స్‌తో.. ట్విట్టర్‌ ప్రమోషన్‌ స్టార్ట్ చేసేశాడు. అప్పుడెప్పుడో.. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయినప్పుడు.. ఆమె స్నేహితురాలు శశికళ జీవిత కథ ఆధారంగా ‘శశికళ’ పేరుతో బయోపిక్ చేయబోతోన్నట్లుగా వర్మ ఒక ప్రకటన వదిలాడు. ఆ వేడి కొంచెం చల్లారడంతో.. దానిని పక్కన పెట్టేసి.. యంగ్‌ హీరోయిన్‌ల అందాలతో కుర్రాళ్లను ముంచే ప్రయత్నాలు మొదలెట్టాడు. 


ఇక జయలలిత బయోపిక్‌గా కంగనా చేసిన 'తలైవి' ఓ కొలిక్కి రావడంతో.. ఆ సినిమాకి పోటీగా తను చెప్పిన 'శశికళ' చిత్రాన్ని విడుదల చేస్తానని ట్విట్టర్‌లో శపథాలు చేస్తున్నాడు. జయలలిత బయోపిక్‌ ఒక్కటే వస్తే.. తమిళనాడు తట్టుకోలేదని.. చెలికత్తె శశికళ బయోపిక్‌ కూడా పక్కన ఉంటేనే తమిళ ప్రేక్షకులకు మజా వస్తుందని చెబుతూ.. వరుస ట్వీట్స్‌తో వర్మ హోరెత్తిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని కూడా ఆయన ఆస్థాన నిర్మాత రాకేష్‌ రెడ్డే నిర్మిస్తున్నట్లుగా వర్మ తెలిపాడు.


 
Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.