అకాల వర్షం రూ.15 లక్షల మేర పంట నష్టం

ABN , First Publish Date - 2021-04-23T06:23:57+05:30 IST

మార్కాపురం మండలంలో బుధవారం సా యంత్రం ఈదురు గాలులతో కురిసిన వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్సింది. చేతి కొచ్చిన బొప్పాయి పంట సుమారు 7 ఎకరాల మేర నేలకొరిగింది.

అకాల వర్షం   రూ.15 లక్షల మేర పంట నష్టం
రాయవరంలో నేలకొరిగిన బొప్పాయి

మార్కాపురం, ఏప్రిల్‌ 22: మార్కాపురం మండలంలో బుధవారం సా యంత్రం ఈదురు గాలులతో కురిసిన వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్సింది. చేతి కొచ్చిన బొప్పాయి పంట సుమారు 7 ఎకరాల మేర నేలకొరిగింది. మండలం లోని రాయవరంలో 2 ఎకరాలు, రాజుపాలెంలో 5 ఎకరాల బొప్పాయి నేల పా లైంది. దీంతో సుమారు రూ.10 లక్షల మేర పంట నష్టం జరిగినట్లు ఉద్యా నవన అధికారి తేజ ధ్రువీకరించారు. అలాగే పెద్దయాచవరం గ్రామంలో ఒక రైతుకు చెందిన సుమారు 3 ఎకరాల మేర పుచ్చకాయల సాగు దెబ్బ తింది. దీని విలువ సుమారు రూ.5 లక్షల మేర ఉండవచ్చని అంచనా వేశారు. ఈ అం చనాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తేజ చెప్పారు. 

బొప్పాయి తోటలకు నష్టం

ఎర్రగొండ సబ్‌డివిజన్‌ 110 ఎకరాల విస్తీర్ణంలో నష్టం

పరిశీలించిన అధికారులు 

ఎర్రగొండపాలెం, ఏప్రిల్‌ 22 : ఎర్రగొండపాలెం సబ్‌ డివిజన్‌లో బుధవారం వీచిన ఈదురుగాలులు, వానకు 110 ఎకరాల విస్తీర్ణంలో కాపుదశలో ఉన్న బొ ప్పాయి తోటలకు  తీవ్రనష్టం జరిగిందని ఉద్యానశాఖాధికారి షేక్‌ నబీరసూల్‌ గురువారం  తెలిపారు.  ఎర్రగొండపాలెం మండలం వై.కొత్తపల్లి గ్రామంలో 15 ఎకరాలు, గురిజేపల్లిలో 30 ఎకరాలు, త్రిపురాంతకం మండలం నడిగడ్డలో 30 ఎకరాలు, దూపాడు గ్రామంలో 25 ఎకరాలు, పెద్దారవీడు మండలం కంబంపా డు, తోకపల్లి గ్రామాల్లో 10 ఎకరాల విస్తీర్ణంలో కాపుదశలో ఉన్న బొప్పాయిచెట్లు విరిగినేలపై పడిపోయాయి. నష్టం జరిగిన రైతుల తోటలను పరిశీలించామని, పరిహారం కోసం పూర్తి నివేదిక సిద్ధం చేసి జిల్లా ఉద్యానవన కార్యాలయానికి పంపిస్తామని ఆయన చెప్పారు. 


Updated Date - 2021-04-23T06:23:57+05:30 IST