వాసాలమర్రి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2021-07-28T06:21:48+05:30 IST

సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రి అభివృద్ధిలో గ్రామస్థులు భాగస్వాములు కా వాలని కలెక్టర్‌ పమేలాసత్ఫథి కోరారు.

వాసాలమర్రి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో శ్రమదానం చేస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

కలెక్టర్‌ పమేలాసత్పథి

తుర్కపల్లి, జూలై 27: సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రి అభివృద్ధిలో గ్రామస్థులు భాగస్వాములు కా వాలని కలెక్టర్‌ పమేలాసత్ఫథి కోరారు. గ్రామస్థులు మం గళవారం చేపట్టిన శ్రమదానంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. గ్రామంలో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనుల ప్రగతిని ఆమె పరిశీలించారు. నిరుద్యోగ యువతీ, యువకులను గుర్తించి నైపుణ్యం, ఆసక్తిగల రంగాల్లో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మొబైల్‌ రిపేరింగ్‌, మహిళలకు టైలరింగ్‌, మగ్గం వర్క్స్‌, బ్యుటీషియన్‌ కోర్సు, కంప్యూటర్‌ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని సూచించారు. ధరణికి సంబంధించి గ్రామంలోని భూ సమస్యలను 15రోజుల్లోగా పరిష్కరించాలని తహసీల్దార్‌ జ్యోతిని ఆదేశించారు. అనంతరం గ్రామ స్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో మందాడి ఉపేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ జ్యోతి, సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ నవీన్‌కుమార్‌,ఉపసర్పంచ్‌ మధు పాల్గొన్నారు. అనంతరం మండలకేంద్రంలోని పీహెచ్‌సీని కలెక్టర్‌ పమేలాసత్పథి పరిశీలించారు. ఆస్పత్రిలో పారిశుధ్య పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టోర్‌రూం లీకేజీకి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఆస్పత్రి రికార్డులను పరిశీలించి గత వేసవిలో చేపట్టిన పారిశుధ్య పనులకు సంబంధించిన రికార్డులతో హాజరు కావాలని ఇన్‌చార్జి డాక్టర్‌ను ఆదేశించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ ఉన్నారు. 

రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలి 

భువనగిరి రూరల్‌: రైతు వేదికల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదే శించారు. కలెక్టరేట్‌లో అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 92 రైతు వేదికలు నిర్మించినట్లు తెలిపారు. విద్యుత్‌, నీటిసౌకర్యాలు కల్పించి వాటిని వినియోగంలోకి తేవాలన్నారు. అసంపూర్తిగా ఉన్న రైతు వేదికలను వారంలోగా పూర్తి చేయాలన్నారు. నూతన ఆవిష్కరణల ద్వారా సృజనాత్మకతను వెలికితీసేలా ఇంటింటా ఇన్నోవేటర్‌ దరఖాస్తు గడువును ఆగస్టు 10వతేదీ వరకు పొడగించినట్లు కలెక్టర్‌ తెలిపారు. అనంతరం ఇంటింటా ఇన్నోవేటర్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్టు తెలిపారు. వివరాలకు సెల్‌ నంబర్‌ 9100678543లో సంప్రదించాలన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సఖీ కేంద్రంలో బాధితులకు సత్వరమే న్యాయ సహాయం అందించి ఆదుకోవాలని కలెక్టర్‌ సూచించారు. సఖి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గృహ హింస బాధితులకు కౌన్సిలింగ్‌ నిర్వహించడంతో పాటు వైద్య, న్యాయ సహాయం అందించాలని సూచించారు. కార్యక్రమాల్లో మిషన్‌ భగీరథ ఈఈ లక్ష్మణ్‌, డీఈవో చైతన్య జైనీ, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, సఖి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు డాక్టర్‌ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-28T06:21:48+05:30 IST