headache: ఈ తలనొప్పి వల్ల.. గుడ్డివాళ్ళు అయిపోతారు జాగ్రత్త..

ABN , First Publish Date - 2022-07-24T02:42:59+05:30 IST

ప్రస్తుతం చాలా మంది తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 శాతం మంది ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. అయితే కొందరికి తలనొప్పి తక్కువగా..

headache: ఈ తలనొప్పి వల్ల.. గుడ్డివాళ్ళు అయిపోతారు జాగ్రత్త..

ప్రస్తుతం చాలా మంది తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 శాతం మంది ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. అయితే కొందరికి తలనొప్పి తక్కువగా వస్తుంది. మరికొందరికి మాత్రం తీవ్రంగా వేధిస్తుంది. ఈ సమయంలో ఎక్కువగా ట్యాబ్లెట్స్ వేసుకుని తాత్కాలిక ఉపశమనం పొందుతారు. కానీ తలనొప్పితో పాటు.. దృష్టి సరిగ్గా లేకపోవడం.. వికారం వంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలనుంటున్నారు నిపుణులు.


ముఖ్యంగా తలకు ఎడమవైపు నొప్పి ఉంటే అత్యవసర చికిత్స తప్పనిసరి అంటున్నారు వారు. ఎడమవైపు వచ్చే తలనొప్పిలో మైగ్రెన్, క్లస్టర్ తలనొప్పులు ఉంటాయి. వీటిని వైద్యులు ప్రాథమిక, ద్వితీయంగా వర్గీకరిస్తారు. ప్రాథమిక తలనొప్పిలో మొదటి లక్షణం. ఇక సెకండరీ తలనొప్పి అనేది ఇతర కారణాల వల్ల వస్తుంది. అది బ్రెయిన్ ట్యూమర్, స్ట్రోక్, ఇన్ఫెక్షన్. ఇందులో ఎడమవైపు తలలోని ఏ భాగానికైనా నొప్పి రావచ్చు. మైగ్రేన్ తలనొప్పి తలకు ఎడమవైపు తీవ్రంగా వస్తుంది. కొందరికి ఇది తక్కువగా ఉంటుంది. మరికొందరికి ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్ వల్ల వచ్చే తలనొప్పి కళ్లకు, తల అంతటా వ్యాపిస్తుంది.

Viral Video: ఈ యువతికి సడన్‌గా ఎంత కోపం వచ్చింది.. నువ్వు ఎవడైతే నాకేంటీ.. అంటూ ఒక్కసారిగా..


సైకోజెనిక్ అనే తలనొప్పి మెడకు గాయమవడం వల్ల వస్తుంది. సైకోజెనిక్ తలనొప్పి మెడలోని ఏదైనా భాగం నుంచి మొదలై తల వరకు వ్యాపిస్తుంది. కొన్నిసార్లు ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. మెడ, తల, ముఖంలో ఒక వైపున వస్తుంది. సైకోజెనిక్ తలనొప్పి లక్షణాలు వేర్వేరు వ్యక్తులలో భిన్నంగా ఉంటాయి. వాస్కులైటిస్ తలనెప్పి రక్త నాళాలు, ధమనులు కణాలను ప్రభావితం చేస్తుంది. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. తలలో ఉండే రక్తనాళాలపై ప్రభావం చూపిస్తుంది. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ నొప్పి ఎక్కువగా వస్తుంది.

Sad incident: ఇలాంటి వైద్యులను ఏమనాలి.. పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణి పరిస్థితి చివరకు ఏమైందంటే..


వాస్కులైటిస్ కారణంగా తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ తలనొప్పి 1 నిమిషం నుండి 5 నిమిషాల వరకు ఉంటుంది. కంటిచూపు కోల్పోవడం, తలలో ఒకవైపు నొప్పి నమిలేటప్పుడు నొప్పి రావడం దీని లక్షణాలు. సరైన సమయానికి వాస్కులైటిస్‌కు చికిత్స చేయకపోతే కంటి చూపును శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి విడవకుండా వచ్చే ఏ తలనెప్పి అయినా.. వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.

KERALA FISHER MAN: చేపల వలలో వింత వస్తువు.. విలువ 28 కోట్లు..!



Updated Date - 2022-07-24T02:42:59+05:30 IST