
అమరావతి: కేంద్రం రెండోసారి పెట్రో వ్యాట్ తగ్గించిందని బీజేపీ నేత సోము వీర్రాజు (Somu Veerraju) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇది వరకు కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించినా ఏపీ సర్కార్ తగ్గించలేదని తప్పుబట్టారు. జగన్ ప్రభుత్వం కూడా పెట్రో ధరలు తగ్గించాలని, ఇప్పటికే అనేక రాష్ట్రాలు పెట్రోపై సుంకం తగ్గించాయని తెలిపారు. ఇంధన ధరలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. Central Excise Dutyను లీటర్ పెట్రోల్‌పై 8 రూపాయలు, లీటర్ డీజిల్‌పై 6 రూపాయలు తగ్గిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సుంకాన్ని తగ్గించడం ద్వారా వాహనదారులకు భారీ ఊరట లభించింది. లీటర్ పెట్రోల్ ధర రూ.9.50, లీటర్ డీజిల్‌పై 7 రూపాయలు తగ్గనుంది. వంట గ్యాస్ సిలిండర్‌పై 200 రూపాయల సబ్సిడీని (12 సిలిండర్ల వరకూ) ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి