సర్టిఫికెట్లు అందజేస్తున్న టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు
ఆకివీడురూరల్ మార్చి 27 : అయిభీమవరం టీటీడీ వేద పాఠశాలలో ద్వితీయ స్నాతకో త్సవం ఆదివారం ఘనంగా జరి గింది.వేదపాఠశాలలో విద్య నభ్యసించిన 2018–19,2019–20 సంవత్సరాలకు చెందిన ఆరు గురు విద్యార్థులకు టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరు బాపిరాజు దంపతులు, తిరుమల ప్రతినిధి కెఎస్.గౌరీ శంకర్ ఘనాపాటి సర్టిఫికెట్లు అందజేశారు. శుక్ల యజుర్వేదం 12 ఏళ్ల కోర్సులో మండ శివసాయి, గర్నేపూడి సాయిరామ్, పోన్న సత్య నారాయణశాస్ర్తి, జోస్యుల నాగసూర్యయాజ్ఞవల్క్యవిజయ్కుమార్, అదర్వణ వేదం ఏడేళ్ల కోర్సులో నుదురుపాటి భార్గవ్ చరణ్,రాజోలు శ్రీసుబ్రహ్మణ్య భాస్కర్లకు సర్టిఫికెట్లు, శ్రీవారి ప్రసాదం, రూ.2 వేల చొప్పున నగదు అంద జేశారు. ప్రిన్సిపాల్ లింగాల సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.