నిలిచిన వేదాద్రి ఎత్తిపోతల నిర్మాణం

ABN , First Publish Date - 2021-10-27T06:25:23+05:30 IST

వేదాద్రి వద్ద కృష్ణానదిపై రూ.480 కోట్లతో చేపట్టిన వైఎస్సార్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల సామగ్రిని మంగళవారం ఐదు భారీ వాహనాలతో కాంట్రాక్టు సంస్థ తరలించుకుపోయింది.

నిలిచిన వేదాద్రి ఎత్తిపోతల నిర్మాణం

సామగ్రిని తరలించిన కాంట్రాక్టు సంస్థ 

బిల్లులు చెల్లించకేనని చర్చ

జగ్గయ్యపేట రూరల్‌, అక్టోబరు 26 : వేదాద్రి వద్ద కృష్ణానదిపై రూ.480 కోట్లతో చేపట్టిన వైఎస్సార్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల సామగ్రిని మంగళవారం ఐదు భారీ వాహనాలతో కాంట్రాక్టు సంస్థ తరలించుకుపోయింది. కొద్ది నెలల క్రితం నిర్మాణ పనులకు బిల్లులు చెల్లించటం లేదని పనులకు స్వస్తి పలికిన కాంట్రాక్టు సంస్థ అంచలంచెలుగా నిర్మాణ స్థలంలోని సామగ్రిని తరలించుకుపోయింది. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల పథకం నిర్మాణం ఆగిందని ఆయా పార్టీల నేతలు నిరసన తెలపటంతో వైసీపీకి చెందిన పలువురు అటువంటిదేమీ లేదని నిర్మాణ పనులు జరుగుతాయని చెప్పినా తాజాగా ప్రాజెక్టు వద్ద మిగిలిన సామగ్రిని తరలించుకుపోవటంతో ప్రాజెక్టు నిర్మాణం లేనట్టేనని రైతులు భావిస్తున్నారు. 


Updated Date - 2021-10-27T06:25:23+05:30 IST