King George Hospitalకి వేదాంత వీజీసీబీ వైద్య పరికరాల విరాళం

ABN , First Publish Date - 2022-06-25T01:29:19+05:30 IST

వేదాంతకు చెందిన వైజాగ్ జనరల్ కార్గో బెర్త్ (VGCB) నగరంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (King George Hospital)లోని

King George Hospitalకి వేదాంత వీజీసీబీ వైద్య పరికరాల విరాళం

విశాఖపట్టణం: వేదాంతకు చెందిన వైజాగ్ జనరల్ కార్గో బెర్త్ (VGCB) నగరంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (King George Hospital)లోని కార్డియాలజీ విభాగానికి కార్డియోలైన్ హోల్టర్ మానిటర్‌ను విరాళంగా అందించి దాతృత్వాన్ని చాటుకుంది. వీజీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సి.సతీష్‌కుమార్ ఈ మెషీన్‌ను ఆసుపత్రి సూపరింటెండెంట్ పి.మైథిలికి అందించారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ మల్లాది శ్రీనివాసరావు, స్థానిక ఇన్‌ఫ్లూయెన్సర్ డాక్టర్ ఫిరీన్ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా డాక్టర్  శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అత్యంత విలువైన హోల్టర్‌ రికార్డర్‌, ఎనలైజర్‌ను కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌కు అందించిన వీజీసీబీకి కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ఈ పరీక్ష చేయడానికి  బయట రూ. 2-3 వేలు ఖర్చవుతుందని, ఇప్పుడు ఇది నిరుపేదలకు ఉచితంగా అందుబాటులోకి రానుందన్నారు. వేదాంత ఐరన్ అండ్ స్టీల్ సెక్టార్ సౌవిక్ మజుందార్ మాట్లాడుతూ.. సమాజాభివృద్ధిలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు కీలకమని తాము విశ్వసిస్తామని, తాము అందించిన పరికరాలతో వైజాగ్, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. 

Updated Date - 2022-06-25T01:29:19+05:30 IST