schoolsలో వేదాలు, రామాయణం, భగవద్గీత బోధిస్తాం

ABN , First Publish Date - 2022-05-02T12:38:37+05:30 IST

ఉత్తరాఖండ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ పాఠశాల సిలబస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు...

schoolsలో వేదాలు, రామాయణం, భగవద్గీత బోధిస్తాం

ఉత్తరాఖండ్ విద్యాశాఖ మంత్రి వెల్లడి

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ పాఠశాల సిలబస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థులకు వేదాలు, రామాయణం, భగవద్గీతలను బోధిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధన్‌సింగ్‌ రావత్‌ వెల్లడించారు.దీంతోపాటు ఉత్తరాఖండ్ చరిత్ర, భౌగోళిక అంశాలను విద్యార్థులకు బోధిస్తామని మంత్రి పేర్కొన్నారు. నూతన విద్యా విధానం ప్రకారం భారతీయ చరిత్ర, సంప్రదాయాల ఆధారంగా విద్యార్థుల సిలబస్‌ను రూపొందించాలని మంత్రి చెప్పారు. వేదపురాణం,భగవద్గీతతోపాటు స్థానిక జానపద భాషలను ప్రోత్సహించాలని అన్నారు.దేశంలోనే కొత్త విద్యా విధానాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుందని మంత్రి చెప్పారు.


 త్వరలో కొత్త సిలబస్‌ను రూపొందించి, కొత్త విద్యా విధానంలోని నిబంధనలను ముద్రిస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారు.ఉత్తరాఖండ్ ఉద్యమ చరిత్ర, గొప్ప వ్యక్తుల గురించి కూడా కొత్త సిలబస్‌లో విద్యార్థులకు బోధిస్తామని మంత్రి వివరించారు.


Updated Date - 2022-05-02T12:38:37+05:30 IST