అత్తింటి వేధింపుల నుంచి విముక్తి కలిగించాలి

ABN , First Publish Date - 2020-11-29T06:01:52+05:30 IST

మండలంలోని సుద్దులం గ్రామానికి చెందిన తన మేనబావతో గతేడాది రూ.10 లక్షల వరకట్నం, కారు, పెళ్లి సామగ్రితో వివాహం జరిపించినా, అదనపు కట్నం తీసుకురావాలంటూ తన భర్త, అత్తింటివారు వేధింపులకు గురిచేస్తున్నారని శ్రీమాన్‌ భార్య, ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు ఎస్‌ఐ సురేష్‌కుమార్‌కు శనివారం వివరించారు.

అత్తింటి వేధింపుల నుంచి విముక్తి కలిగించాలి

పోలీసుల ఎదుట బాధితురాలు, తల్లిదండ్రుల మొర
డిచ్‌పల్లి, నవంబరు 28: మండలంలోని సుద్దులం గ్రామానికి చెందిన తన మేనబావతో గతేడాది రూ.10 లక్షల వరకట్నం, కారు, పెళ్లి సామగ్రితో వివాహం జరిపించినా, అదనపు కట్నం తీసుకురావాలంటూ తన భర్త, అత్తింటివారు వేధింపులకు గురిచేస్తున్నారని శ్రీమాన్‌ భార్య, ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు ఎస్‌ఐ సురేష్‌కుమార్‌కు శనివారం వివరించారు. ఈ విషయమై తన తల్లిదండ్రులతో కలిసి గ్రామస్థుల మద్దతుతో భర్త ఇంటికి తాళం వేసి శుక్రవారం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అదనపు కట్నం తేవాలని తనను, రెక్కాడితే గానీ డొక్కాడని తమ కుటుంబసభ్యులను వేధింపులకు గురిచేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని శ్రీమాన్‌ భార్య కన్నీటిపర్యంతమైంది. వివాహం జరిగిన నుంచి ఆమె భర్త తమ కుమార్తెను వేధిస్తున్నాడని,  తమను కూడా మానసికంగా హింసిస్తున్నారని బాధితురాలి తల్లి సుజాత, తండ్రి శంకర్‌ పోలీసుల ఎదుట వాపోయారు. వేధింపులపై గ్రామ ప్రజా ప్రతినిధులకు తాము ఫిర్యాదు చేయగా, నష్టపరిహారం ఇస్తానని ఒప్పుకొని, అనంతరం  శ్రీమాన్‌, ఆతని కుటుంబసభ్యులు చేతులెత్తేయడం ఎంతవరకు సమంజసమన్నారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయం వేరెవరికీ జరుగకుండా శ్రీమాన్‌తోపాటు ఆతని కుటుంబసభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరారు.

Updated Date - 2020-11-29T06:01:52+05:30 IST