Amaravathi: ఎంపీ వ్యాఖ్యలపై కలెక్టర్లతో మాట్లాడుతున్నాం: పౌర సరఫరాల శాఖ ఎండీ వీర పాండియన్

ABN , First Publish Date - 2022-05-19T20:03:08+05:30 IST

రబీ ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణానికి సంబంధించి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలపై కలెక్టర్లతో మాట్లాడుతున్నామని పౌర సరఫరాల శాఖ ఎండీ వీర పాండియన్ తెలిపారు. ఎంపీ చెప్పినట్లుగా అవతవకలు జరిగే ఆస్కారమే

Amaravathi: ఎంపీ వ్యాఖ్యలపై కలెక్టర్లతో మాట్లాడుతున్నాం: పౌర సరఫరాల శాఖ ఎండీ వీర పాండియన్

అమరావతి: రబీ ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణానికి సంబంధించి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలపై కలెక్టర్లతో మాట్లాడుతున్నామని పౌర సరఫరాల శాఖ ఎండీ వీర పాండియన్ తెలిపారు. ఎంపీ చెప్పినట్లుగా అవతవకలు జరిగే ఆస్కారమే లేదన్నారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్. నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు నమోదు చేసి.. మిగతా రెండు ఎకరాలు వేరే వాళ్ల పేర్ల మీద నమోదు చేసే ఆస్కారమే లేదన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 68 వేల మంది రైతులుంటే..51 వేల మంది మాత్రమే ఈకేవైసీ నమోదు చేసుకున్నారని వీరపాండియన్ తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద ఇంకా 22 శాతం ఈకేవైసీ పూర్తి కావాల్సి ఉందని, దాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.  

Updated Date - 2022-05-19T20:03:08+05:30 IST