ఘనంగా వీరభద్రుడి పల్లకీ ఉత్సవం

ABN , First Publish Date - 2022-08-16T05:57:23+05:30 IST

పట్టణంలోని భద్రకాళీ సమేత వీరభద్రాలయంలో సోమవారం స్వామి వారి పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రకాళీ అమ్మవారు, వీరభద్రుడు ఉత్సవ విగ్రహాలను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయం చుట్టూ బ్యాండ్‌మేళాలు, కోలాటాల మధ్య ఊరేగించారు.

ఘనంగా వీరభద్రుడి పల్లకీ ఉత్సవం
పల్లకీ ఉత్సవంలో వీరభద్రుడు, భద్రకాళీ అమ్మవారు

రాయచోటిటౌన్‌, ఆగస్టు 15: పట్టణంలోని భద్రకాళీ సమేత వీరభద్రాలయంలో సోమవారం స్వామి వారి పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రకాళీ అమ్మవారు, వీరభద్రుడు ఉత్సవ విగ్రహాలను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయం చుట్టూ బ్యాండ్‌మేళాలు, కోలాటాల మధ్య ఊరేగించారు. అలాగే సంకట హర చతుర్థి సందర్భంగా వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వేదపండితులు, ఆలయ ఈవో రమణారెడ్డిల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అలాగే ఆలయ కమిటీ చైర్‌పర్సన్‌ పోలంరెడ్డి విజయ, ఆలయ ఈవో రమణారెడ్డిల ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజంపేట ఆర్డీవో కోదండరామిరెడ్డి భద్రకాళీ సమేత వీరభద్రుడిని దర్శించుకుని ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం భద్రకాళీ అమ్మవారు, వీరభద్రుడిని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అలాగే రాయచోటి పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. 

Updated Date - 2022-08-16T05:57:23+05:30 IST