శాప్ చైర్మన్ బైరెడ్డి అనుచరుడి వీరంగం

ABN , First Publish Date - 2022-04-08T01:04:14+05:30 IST

శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరుడు చికెన్

శాప్ చైర్మన్ బైరెడ్డి అనుచరుడి వీరంగం

నంద్యాల: శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరుడు చికెన్ బాషా వీరంగం సృష్టించారు. నందికొట్కూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో మహిళా డాక్టర్, సిబ్బందిపై బాషా, అతని అనుచరులు దాడి చేశారు. దీంతో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. మర్డర్ చేయడం తన వృత్తి అని చెప్పి బాషా బెదిరింపులకు గురి చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నందికొట్కూరు మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ సాయిఈశ్వర్‌ హత్య కేసులో బాషా నిందితుడిగా ఉన్నాడు. 



Updated Date - 2022-04-08T01:04:14+05:30 IST