వెజ్‌ జాల్‌ఫ్రెజీ

ABN , First Publish Date - 2021-11-26T19:07:42+05:30 IST

వెన్న- స్పూను, ఉల్లి - రెండు, బీన్స్‌ - పది, క్యారెట్‌ - రెండు, టొమాటో - రెండు, పచ్చి బిఠానీలు- అర కప్పు, బేబీ కార్న్‌- అయిదు, క్యాప్సికమ్‌- రెండు, నూనె, ఉప్పు, నీళ్లు- తగినంత, ఆవాలు- స్పూను, లవంగాలు- మూడు, అల్లం- కాస్త, పచ్చిమిర్చి-

వెజ్‌ జాల్‌ఫ్రెజీ

కావలసిన పదార్థాలు: వెన్న- స్పూను, ఉల్లి - రెండు, బీన్స్‌ - పది, క్యారెట్‌ - రెండు, టొమాటో - రెండు, పచ్చి బిఠానీలు- అర కప్పు, బేబీ కార్న్‌- అయిదు, క్యాప్సికమ్‌- రెండు, నూనె, ఉప్పు, నీళ్లు- తగినంత, ఆవాలు- స్పూను, లవంగాలు- మూడు, అల్లం- కాస్త, పచ్చిమిర్చి- రెండు, పుసుపు- చిటికెడు, టొమాటో సాస్‌- రెండు స్పూన్లు, గరం మసాలా- అర స్పూను, మిరియాల పొడి- అర స్పూను, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు.


తయారుచేసే విధానం: ముందుగా కూరగాయలన్నిటినీ తరగాలి. ఓ పాన్‌లో వెన్న కాగాక ఉల్లి, బీన్స్‌, క్యారెట్‌, టొమాటో, బఠానీ, బేబీ కార్న్‌ ముక్కల్ని వేయించాలి. కాస్త ఉప్పు జతచేయాలి. ఓ నిమిషం తరవాత క్యాప్సికమ్‌ ముక్కలు కలపాలి. కూరగాయలన్నీ దగ్గరకి అయ్యాక స్టవ్‌ కట్టేయాలి. మరో పాన్‌లో నూనె వేసి ఆవాలు, లవంగాలు, అల్లం, పచ్చి మిర్చి ముక్కలు వేపాలి. అర కప్పు ఉల్లి ముక్కల్ని కూడా వేసి బంగారు వర్ణంలోకి మారగానే కారం, ఉప్పు, పసుపు వేయాలి. ఓ నిమిషం తరవాత టొమాటో ముక్కలు వేసి మగ్గించాలి. టొమాటో సాస్‌ వేసి కలపాలి. ఆ తరవాత వేయించిన కూరగాయలు, గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలిపి రెండు నిమిషాలు మూతపెడితే వెజ్‌ జాల్‌ఫ్రెజీ రెడీ. పైన కొత్తిమీర తరుగును చల్లాలి. చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది ఈ వంటకం.

Updated Date - 2021-11-26T19:07:42+05:30 IST