వంటలు

వెజ్‌ లాలీపాప్‌

వెజ్‌ లాలీపాప్‌

కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు (ఉడికించినవి)- రెండు, క్యాబేజీ ముక్కలు- పావు కప్పు, క్యారెట్‌ తురుము- పావు కప్పు, క్యాప్సికమ్‌ ముక్కలు- మూడు స్పూన్లు, ఉల్లి ముక్కలు- మూడు స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు- అర స్పూను, పసుపు- చిటికెడు, కారం- పావు స్పూను, మిరియాల పొడి- పావు స్పూను, ధనియా, గరం మసాలా పొడి- అర స్పూను, వరి పిండి- మూడు స్పూన్లు, శెనగ పిండి- స్పూను, నీళ్లు, నూనె, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: ఓ గిన్నెలోకి కూరగాయలన్నిటినీ తీసుకోవాలి. దాంట్లోనే పొడులన్నిటినీ వేయాలి. అల్లం వెల్లుల్ని పేస్టు, ఉప్పూ కారాన్నీ చేర్చాలి. బియ్యం పిండినీ వేసి తగినంత నీటితో ముద్దగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరవాత చిన్న ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓ గిన్నెలో శెనగ పిండిని నీటితో కాస్త జారుగా కలుపుకోవాలి. ఇందులో కూరగాయల ముద్దల్ని ముంచి నూనెలో వేయించి తీయాలి. టూత్‌పిక్‌లను ఒక్కో ముద్దకు గుచ్చితే వెజ్‌ లాలీపా్‌పలు రెడీ.

Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.