అధరహో..ట‘మాట’వినదు

ABN , First Publish Date - 2020-09-22T05:30:00+05:30 IST

పేదలు, మధ్య తరగతి వారికి అవసరమయ్యే టమాట, పచ్చి మిర్చి ధర మండిపోవటంతో ఏమితినాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది

అధరహో..ట‘మాట’వినదు

ఘాటెక్కుతున్న ఉల్లి

కనిపించని ఆకు కూరలు

మండిపోతున్న కూరగాయల ధరలు


పాలమూరు, సెప్టెంబరు 22: పేదలు, మధ్య తరగతి వారికి అవసరమయ్యే టమాట, పచ్చి మిర్చి ధర మండిపోవటంతో ఏమితినాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. మార్చి నెలలో కరోనా సమస్య మొదలైనప్పటి నుంచి టమాట ధర రూ.20లోపే ఉండే ది... నేడు రూ.50 చేరుకుంది. రూ.10కి 15 ఆకు కూర కట్టలిచ్చే రైతులు నేడు మూడు, నాలుగు కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. ఏ కూరలేకున్నా కనీసం టమాట చారు చేసుకోవటానికి దిక్కులేని పరిస్థితి నెలకొంది. 45 రోజుల క్రితం ఉన్న కూర గాయల ధరలు నేడు రెట్టింపు కావడంతో ఏం తినాలని మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


రైతు బజార్‌లో ధరలు ఇలా ఉంటే కాలనీలు, ఇళ్ల దగ్గరకు గంపలు, బండ్ల మీద తెచ్చి వారి వద్ద 30 శాతం అదనపు ధరలు ఉంటున్నాయి. ఏ కూర వండు కోవాలన్నా అందులోకి ఉల్లిగడ్డ తప్పనిసరి. కిలో ఏకం గా రూ.40కి చేరుకోవడంతో కొనాలంటేనే ఆలోచిం చాల్సిన పరిస్థితి. ఆగస్టు లో రూ.16 ఉండగా నేడు రూ.40కి చేరుకుంది. అన్ని కూరల్లోకి వాడు కునే మెం తికూర రూ.10కి మూడు కట్టలు ఇస్తున్నారు. పుండి కూర, కొత్తిమీర, పుదీనాను ఒకరిద్దరు తప్ప ఎవరూ తీసుకు రావడం లేదు. పాలకూర, తోటకూర, గంగవాలి కూర అసలు రైతు బాజర్‌కు రావడమే లేదు.


ధరలెందుకు పెరుగుతున్నయంటే..

రైతులకు అవసరమైన సమయంలో వర్షాలు సరిగా పడలేదు. కూర గాయలు చేతికొచ్చే సమయంలో అధి కంగా వర్షం రావడంతో పంట నష్టం జరిగింది. అధిక వర్షంతో కూరగాయల తోటలో నీరు నిలిచి టమాట, వంకాయ, పచ్చి మిర్చి, బీరకాయ, క్యాబేజీ లాంటి కూర గాయలు కుళ్లిపోయాయి. ఉల్లిగడ్డదీ ఇదే పరిస్థితి. దీంతో ఉన్న కొద్దిపాటి కూరగాయలను రవాణా చేసి అమ్ముకోవటానికి వీలుకాని రైతులు వచ్చిన కాడికని వ్యాపారు(దళారులు)లకు అమ్ముకుంటున్నారు. దీని వల్ల రైతు, వినియోగదారుడు నష్ట పోతుండగా వ్యాపారి మాత్రమే లాభం పొందుతున్నాడు. 

Updated Date - 2020-09-22T05:30:00+05:30 IST