మళ్లీ మండుతున్నాయ్‌

ABN , First Publish Date - 2022-05-29T06:46:36+05:30 IST

కూరగాయల ధరలు మళ్లీ పెరిగిపోతున్నాయి

మళ్లీ మండుతున్నాయ్‌
కూరగాయల దుకాణం

పెరుగుతున్న కూరగాయల ధరలు

బహిరంగ మార్కెట్‌లో టమాటా కేజీ రూ. 100 

మిగిలినవి కేజీ రూ. 40 నుంచి రూ.60

నిలకడగా ఉల్లిపాయల ధర

బెంబేలెత్తిపోతున్న కొనుగోలుదారులు


గోపాలపురం/నిడదవోలు, మే 28 : కూరగాయల ధరలు మళ్లీ పెరిగిపోతున్నాయి. గత కొంత కాలంగా దిగొచ్చాయి. సాధారణంగా ఎండాకాలంలో దిగుబడి తక్కువగా ఉండడంతో డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలం ఆరంభంలో ధరలు ఎక్కువగా ఉంటాయి. ఆ తరువాత తగ్గుతూ వసాయి. ఈ ఏడాది మాత్రం ధరలు కాస్త తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి.ఎండలు పెరిగినట్టే మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ధరల పెరుగుదలను చూసి విని యోగదారులు బెంబెలెత్తిపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా వంకా యలు గతంలో రూ.120 ధర పలకడం విశేషం. దీంతో రైతులు పండగ చేసుకున్నారు. ఇప్పుడు ఆ స్థానం టమాటాలు భర్తీ చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కిలో రూ.10 కూడా పలకని నాటు టమాటాలు.. సీజన్‌ ముగియడంతో చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వస్తున్న టమాటాలకు బహిరంగ మార్కె ట్‌లో మంచి డిమాండ్‌ ఏర్పడింది. దాదాపు అన్ని కాలాల్లోనూ టమాటాలను వినియోగదారులు కూరల్లో వినియోగిస్తున్నారు. వీటికి నిత్యం డిమాండ్‌ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టమాటాల ధర రైతు బజార్‌లో అయితే రూ.60 బహిరంగ మార్కెట్‌లో అయితే రూ. 100లు పలుకుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో వాటి ధరను చూసి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.ఈ ప్రాంతంలో పండే నాటు కొత్తిమీర సీజన్‌ ముగియడంతో బెంగళూరు నుంచి వచ్చే హైబ్రీడ్‌ కొత్తిమీరనే వినియోగదారులు వాడుతు న్నారు. ప్రస్తుతం క్తొతమీర ధర కూడా బాగానే ఉంది. కేజీ రూ. 120 వరకూ విక్రయిస్తున్నారు. మిలిగిన కూరగాయల ధరలు సైతం రూ.40 - 60 పలుకుతున్నాయి. ఈ ధరలను చూసి సామాన్యుల నుంచి మధ్యతరగతి వరకు  అవాక్కవుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయోయని ఆశగా ఎదురు చూస్తు న్నారు. శుక్రవారం బహిరంగ మార్కెట్‌లో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కిలో టమటా - 100, బెండ రూ.60, బీరకాయలు రూ.60, కాకర రూ.60, మిర్చి రూ.60, గోరుచిక్కుడు రూ.60, బంగాళాదుంప రూ.40, దొండకాయలు రూ.40, దోసకాయలు రూ.30, ఆన బకాయలు రూ.20, ఉల్లి రూ.15. రైతు బజార్‌లో అయితే ధరలు కాస్త అటూ ఇటూగా ఉన్నాయి. ఆకు కూరలు కట్ట రూ. 15ల వరకూ విక్రయిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు.


మా చేయి మారితే.. ధర మారిపోతోంది..

మా దగ్గర కొనుగోలు చేస్తే ధర ఉండదు.. అయితే దళారుల నుంచి చేతుల మారితే మాత్రం ఽధర అమాంతం పెరిగిపోతోంది.టమాటా నిన్నటి వరకూ మనం పండించాం. రూ.10లకు కొన్నారు.. ఇప్పుడు ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుని రూ.100కు విక్రయిస్తున్నారు. ఏం మాయో అర్ధం కావడంలేదు.. పండించే రైతుకు గిట్టుబాటు ధర కష్టమవుతోంది.

- వేచూరి చిన్ని, కూరగాయల రైతు, మంగపతిదేవిపేట


Updated Date - 2022-05-29T06:46:36+05:30 IST