Advertisement

ద్విచక్రవాహనంపై 87 చలానాలు

Mar 6 2021 @ 01:50AM
వాహనదారుడికి చలానా రసీదు ఇస్తున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ మోహన్‌

ఖైరతాబాద్‌ మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఎనభై ఏడు చలానాలు పెండింగ్‌లో ఉన్న ద్విచక్రవాహనాన్ని ట్రాఫిక్‌ పోలీసులు సీజ్‌ చేశారు. శుక్రవారం సైఫాబాద్‌ పోలీసులు నిరంకారి చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. హెల్మెట్‌ లేకుండా ద్విచక్రవాహనం(ఏపీ 09 బీటీ 5089)పై వచ్చిన వ్యక్తిని ఆపారు. వాహనంపై 87 చలానాలు, రూ. 20,400 జరిమానా పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించి వాహనాన్ని సీజ్‌ చేశారు. వాహన యజమాని ఎంఎస్‌ మక్తాకు చెందిన సాజిద్‌ అని, అతడు తరచూ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని ఎస్‌ఐ మోహన్‌ తెలిపారు. 


Follow Us on:
Advertisement