Veluruలో లోతట్టు ప్రాంతాలు జలమయం

ABN , First Publish Date - 2022-07-19T13:07:07+05:30 IST

జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన భారీవర్షంతో వేలూరులోని పలు లోతట్టు ప్రాంతా లు జలమయమయ్యాయి.రాత్రి 9గంటల నుంచి రెండు గంటలు ఉరుములు,

Veluruలో లోతట్టు ప్రాంతాలు జలమయం

- అల్లాడిపోతున్న జనం 

- జిల్లాలో 63.2 మి.మీ వర్షపాతం నమోదు


వేలూరు(చెన్నై), జూలై 18: జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన భారీవర్షంతో వేలూరులోని పలు లోతట్టు ప్రాంతా లు జలమయమయ్యాయి.రాత్రి 9గంటల నుంచి రెండు గంటలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. కాట్పాడిలో అత్యధికంగా 17.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇదిలా వుండగా కొద్దిరోజులుగా స్వల్ప వర్షం పడుతుండడం, ఆదివారం రాత్రి భారీ వర్షం కురవడంతో స్థానిక టోల్‌గేట్‌ ఆఫీసర్స్‌ లైన్‌, ఆరణి రోడ్డు, సున్నాంబుకార వీధి, కొసపేట, వసంతాపురం, బర్మా కాలనీ, సయత్‌ నగర్‌, సెన్‌పాక్కంరోడ్డు తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు రోడ్లపైకి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. చాలామంది ఇళ్లువదిలి వేరే ప్రాంతాలకు తరలిపోగా, ఈ ప్రాంతాల్లో వున్న వారు ఆహారం దొరక్క, వండుకునే మార్గం లేక అల్లాడిపోయారు. ఇదిలా వుండగా గుడియాత్తంలో 7 మి.మీ, మేల్‌ అలత్తూర్‌లో 6.2 మి.మీ, పొన్నైలో 3.2 మి.మీ, వేలూరులో 14.6 మి.మీ, వేలూరు కో-ఆపరేటివ్‌ చక్కెర కర్మాగారం ప్రాంతంలో 14.4 మి.మీ అని, జిల్లా వ్యాప్తంగా 63.2 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-07-19T13:07:07+05:30 IST