KTR: వేములవాడలో కేటీఆర్‌కు ఊహించని ఘటన

ABN , First Publish Date - 2022-09-17T01:11:00+05:30 IST

వేములవాడ (Vemulawada)లో మంత్రి కేటీఆర్‌ (KTR)కు ఊహించని ఘటన జరిగింది. వేములవాడ గుడి చెరువు వద్ద వజ్రోత్సవాల సభలో మంత్రి

KTR: వేములవాడలో కేటీఆర్‌కు ఊహించని ఘటన

రాజన్నసిరిసిల్ల: వేములవాడ (Vemulawada)లో మంత్రి కేటీఆర్‌ (KTR)కు ఊహించని ఘటన జరిగింది. వేములవాడ గుడి చెరువు వద్ద వజ్రోత్సవాల సభలో మంత్రి కేటీఆర్‌ వేదికపై ఉండగా వేదిక కింది నుంచి యువకుడు సాయికిరణ్‌ వందల మంది పోలీసులు ఉన్నా ఒక్కసారిగా స్టేజీపైకి దూసుకెళ్లాడు. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం చెందిన సాయికిరణ్‌ అనే యువకుడు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇప్పించాలంటూ వేడుకోవడానికి వేదిక పైకి దూసుకెళ్లాడు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జూనియర్‌ కళాశాల మైదానం, వేములవాడ గుడి చెరువు మైదానంలో సభలు నిర్వహించారు.

Updated Date - 2022-09-17T01:11:00+05:30 IST