
రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా రూ. 55 లక్షల 16 వేల 998 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఎనిమిది రోజులుగా భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను రాజన్న ఆలయంలోని ఓపెన్‌స్లాబ్‌లో గురువారం అత్యంత భద్రత మధ్య లెక్కించారు. ఈ సందర్భంగా 55 లక్షల 16 వేల 998 రూపాయల నగదు, 65 గ్రాముల 250 మిల్లీగ్రాముల బంగారం, 3 కిలోల 180 గ్రాముల వెండి సమకూరినట్లు ఈవో పేర్కొన్నారు. ఈవో రమాదేవి, ఏఈవోలు హుండీ లెక్కింపును పర్యవేక్షించారు.