
తిరుపతి(విద్య), మే 28: తిరుపతిలోని టీపీపీఎం స్కూల్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో జిల్లా ప్రధానోపాధ్యాయు(హెచ్‌ఎం)ల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్ కె.వెంకటరమణ (బండారుపల్లెలోని జడ్పీహెచ్‌ఎ్‌సలో హెచ్‌ఎం), ప్రధానకార్యదర్శిగా బి.మునిరత్నం, గౌరవాధ్యక్షుడిగా చెంగల్‌రాజు, కోశాధికారిగా జి.శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఆనందబాబు, శంకరయ్య, మనోజ్‌కుమార్‌లను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.