Advertisement

వెంకీ ‘జయం మనదేరా’కు 20 ఏళ్ళు

Oct 6 2020 @ 22:28PM

విక్టరీ వెంకటేశ్, సౌందర్య హీరోహీరోయిన్లుగా ఎన్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జయం మనదేరా'. ఈ చిత్రం అప్పట్లో పలు రికార్డులు సొంతం చేసుకుంది. అక్టోబర్ 7తో ఈ చిత్రం ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం.


కుటుంబకథా చిత్రాలతో ఆకట్టుకోవడంలో మేటి వెంకటేశ్. ఇక అభ్యుదయ భావాలతో చిత్రాలను రూపొందించడంలో దిట్ట దర్శకుడు ఎన్.శంకర్. వీరిద్దరి కలయికలో రూపొందిన 'జయం మనదేరా' చిత్రంలో వెంకటేశ్ ఇమేజ్ కు తగ్గ కథ, కథనంతో శంకర్ తనదైన శైలిని ప్రదర్శించారు. నిమ్నజాతి పక్షాన నిలచి పోరాటం చేసిన కథానాయకుణ్ణి, అయినవాళ్ళే పంతం కోసం పొట్టన పెట్టుకుంటారు. అతని వారసుడు విదేశాల నుంచి తిరిగి వచ్చి, అసలు కథ తెలుసుకొని తన తండ్రి ప్రాణాలు తీసుకున్న వారిని ఎలా మట్టు పెట్టాడు అన్నది ఈ చిత్రకథ. తండ్రీకొడుకులుగా వెంకటేశ్ ద్విపాత్రాభినయంతో అలరించారు. ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం ఎస్సెట్ గా నిలచింది. 

 

సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేశ్ బాబు నిర్మించిన 'జయం మనదేరా'  అనూహ్య విజయం సాధించింది. ఆ రోజుల్లో 12 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి అహో అనిపించింది. ఇక ఈ చిత్రం 104 కేంద్రాలలో అర్ధశతదినోత్సవం జరుపుకొని అప్పట్లో ఓ రికార్డు నెలకొల్పింది. అదే ఏడాది సంక్రాంతి సంబరాల్లో వచ్చిన వెంకటేశ్ చిత్రం 'కలిసుందాం రా' బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇలా రెండు చిత్రాల ఘన విజయంతో  2000వ సంవత్సరం తనదేనని  చాటుకున్నారు వెంకటేశ్. ఈ సినిమా ఇప్పటికీ బుల్లితెరపై అప్పుడప్పుడూ అలరిస్తూనే ఉండడం విశేషం.


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.