సోనూ కోసం ఇంత సాహసమా?

Jun 10 2021 @ 22:11PM


కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలిచిన సోనూసూద్‌ను కాలినడకన ప్రయాణం చేసి ఆయన్ను కలుసుకున్నారు ఓ అభిమాని. వికారాబాద్‌కు చెందిన సోనూ అభిమాని వెంకటేశ్‌ చెప్పులు లేకుండా 700 కిలోమీటర్లు నడుచుకుంటూ ముంబై చేరుకుని సోనూసూద్‌ని కలిశారు. కాలి నడకన తనను చూడటానికి వచ్చిన వెంకటేశ్‌ను చూసి సోనూ చలించిపోయారు. తన యోగక్షేమాలు అడిగి ఫొటో దిగారు. ‘‘వెంకటేశ్‌ హైదరాబాద్‌ నుంచి ముంబై వరకూ కాలి నడకన నన్ను కలవడానికి వచ్చారు. అతన్ని చూస్తుంటే చాలా ఇన్‌స్ఫైరింగ్‌గా ఉంది. కానీ ఇంత ఇబ్బంది పడుతూ రావడాన్ని నేను ఎంకరేజ్‌ చేయను’’ అని సోనూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. 



Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.