వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం

ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST

వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం

వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం
స్వామివారి కల్యాణోత్సవంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి


  • పట్టు వస్ర్తాలు సమర్పించిన మంత్రి మల్లారెడ్డి

ఘట్‌కేసర్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌, మే16: పోచారం మున్సిపాలిటీ పరిధి యంనంపేట్‌లోని శ్రీరంగనాఽథ స్వామి దేవాలయంలో సోమవారం శ్రీపద్మావతి వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఐదు రోజులుగా ఆలయంలో వార్షికోత్సవ పూజలు నిర్వహించారు. చివరి రోజు సోమవారం ఆలయ కమిటీ చైర్మన్‌ పోలగోని రాజే్‌షగౌడ్‌ ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణాన్ని వేదమంత్రోచ్ఛరణల మధ్య పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఆలయ అభివృద్ధికి దేవాలయ కమిటీ చైర్మన్‌ పోలగోని రాజేష్‌ రూ. 5లక్షల చెక్కును మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా అధికారులకు అందజేశారు. గతంలోనూ రూ.5లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ నానావత్‌ రెడ్డియా నాయక్‌, కమిషనర్‌ సురేష్‌, కౌన్సిలర్లు నర్రి ధనలక్ష్మి, సాయిరెడ్డి,వెంకటే్‌షగౌడ్‌, రవీందర్‌, బాల్‌రెడ్డి,సురేందర్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, బాలేష్‌, జగన్‌మోహన్‌రెడ్డి, అక్రంఅలీ, కాశయ్య, శివకుమార్‌, నర్సింహ, నరేష్‌, శ్రీశైలం, బుచ్చిరెడ్డి, పోశేట్టి,  పాల్గొన్నారు. కాగా వెంకటాపూర్‌లోని శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణమహోత్సవం కనులపండువగా జరిగింది. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, నిత్యహోమం, ప్రాబోధిక నివేదన, బలిహారణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. ఆలయకమిటీ చైర్మన్‌ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. గోవిందా నామస్మరణతో  ఆలయ ప్రాంగణం మార్మోగింది. మహిళలు స్వామివారికి పూలు, పండ్లతో పాటు ఒడిబియ్యం సమర్పించారు. మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది ఽశరత్‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి స్వామివారిని దర్శించుకుకున్నారు. కార్యక్రమంలో ఎంపీసీ సుదర్శన్‌రెడ్డి,  మునిసిపల్‌ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, సర్పంచులు నీరుడి గీతాశ్రీనివాస్‌, ఓరుగంటి వెంకటే్‌షగౌడ్‌, చిలుగూరిమంగమ్మ, ఎంపీడీవో అరుణ,. ఆలయఈవో ఎల్‌, భాగ్యలక్ష్మి, ఎంపీవో నందకిషోర్‌, తోటకూర వజ్రే్‌షయాదవ్‌, బండారి శ్రీనివా్‌సగౌడ్‌, కట్టసత్యనారాయణగౌడ్‌, రాజు, శంకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-16T05:30:00+05:30 IST