ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో రావికి ఊరట

ABN , First Publish Date - 2020-12-01T06:07:22+05:30 IST

టీడీపీ గుడివాడ నియోజకవర్గం ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరావు సహా నలుగురిపై నమోదైన ఎస్సీ ఎన్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు చేయవద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.

ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో రావికి ఊరట

అరెస్ట్‌ నుంచి మినహాయింపు

గుడివాడ, నవంబరు 30: టీడీపీ గుడివాడ నియోజకవర్గం ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరావు సహా నలుగురిపై నమోదైన ఎస్సీ ఎన్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు చేయవద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. రావి తరపున న్యాయవాది కె.ఎం.కృష్ణారెడ్డి హైకోర్టులో స్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయగా హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. బొమ్ములూరుకు చెందిన తలారి గోపి, యంగల నాగేంద్రబాబులు  రావితో పాటు ముళ్లపూడి రమేష్‌, షేక్‌ జానీ, అడుసుమిల్లి శ్రీనివా్‌స టిడ్కో ఇళ్ల వద్ద నిరసనలో భాగంగా తమను కులం పేరుతో దూషించారని రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. టిడ్కో ఇళ్ల వద్ద నిరసన సందర్భంగా ఎలాంటి గొడవలూ జరగలేదని న్యాయవాది చేసిన వాదనతో హైకోర్టు ఏకీభవించింది. దీంతో రావితో పాటు మిగతా ముగ్గురికి అరెస్ట్‌ నుంచి మినహాయింపు లభించింది. సీఆర్‌పీసీ 41(ఏ) కింద నోటీసులు ఇచ్చి విచారణ కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 


Updated Date - 2020-12-01T06:07:22+05:30 IST