మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
తాడేపల్లిగూడెం రూరల్, మే 24: వెంకట్రామన్నగూడెం రిజర్వ్ ఫారెస్ట్‌లో మంగళవారం వేసవి ఎండలకు మంటలు చెలరేగాయి. సుమారు 45 ఎకరాల మేర అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేయగా మళ్లీ రాత్రికి అగ్గి రాజుకోవడంతో వాటిని సిబ్బంది అదుపు చేస్తున్నారు. నష్టం తెలియాల్సి ఉందని అగ్నిమాపక అధికారి రామారావు తెలిపారు.