సీఎం చుట్టూ ఉన్న సలహాదారులకు లెక్కలు తెలియవు: వెంకట్రామిరెడ్డి

ABN , First Publish Date - 2022-02-04T21:09:50+05:30 IST

మధ్యంతర భృతి వడ్డీలేని అప్పుగా సీఎస్ లాంటి ఉన్నతాధికారి మాట్లాడటం వితండవాదమని...

సీఎం చుట్టూ ఉన్న సలహాదారులకు లెక్కలు తెలియవు: వెంకట్రామిరెడ్డి

విజయవాడ: మధ్యంతర భృతి వడ్డీలేని అప్పుగా సీఎస్ లాంటి ఉన్నతాధికారి మాట్లాడటం వితండవాదమని పీఆర్సీ సాధన సమితి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం స్టీరింగ్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీకి, డీఏకు ఏదైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. ప్రతీ ఉద్యోగికి కేంద్రం ఆదేశాల మేరకు చెల్లింపు ఉంటుందన్నారు. సీఎం జగన్ చుట్టూ ఉన్న సలహాదారులకు లెక్కలు తెలియవన్నారు. ఉద్యోగులకు మాత్రమే వారి వేతన వివరాలు తెలుస్తాయన్నారు. ఈ విషయాన్ని గమనంలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వెంకట్రామిరెడ్డి సూచించారు.

Updated Date - 2022-02-04T21:09:50+05:30 IST