దళితురాలు వెంకాయమ్మకు రక్షణ కల్పించాలి: టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2022-06-14T01:08:12+05:30 IST

గుంటూరు: సీఎం జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిందని తాడికొండ మండలం కంతేరు గ్రామ దళిత మహిళ వెంకాయమ్మపై కొందరు వైసీపీ నాయకులు ఇటివల దాడి చేశారు.

దళితురాలు వెంకాయమ్మకు రక్షణ కల్పించాలి: టీడీపీ నేతలు

గుంటూరు: సీఎం జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిందని తాడికొండ మండలం కంతేరు గ్రామ దళిత మహిళ వెంకాయమ్మపై కొందరు వైసీపీ నాయకులు ఇటీవల దాడి చేశారు. తనకున్న నాలుగున్నర సెంట్ల స్థలంలో మూడున్నర సెంటు ఆక్రమణకు గురికాగా.. న్యాయం కోసం చాలాకాలంగా వెంకాయమ్మ తహసీల్దార్‌ చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో విసిగెత్తిపోయిన ఆమె జగన్ పాలనలో ఏ సమస్యా పరిష్కారం కాదని బహిరంగంగానే చెప్పింది. దీంతో వైసీపీ నాయకులకు కోపం వచ్చి, ఆమె ఇంటిపై దాడికి పాల్పడ్డారు. 

   

    ఈ నేపథ్యంలో వెంకాయమ్మకు వైసీపీ మూకల నుంచి రక్షణ కల్పించాలని ఎస్పీని కోరాతామని టీడీపీ నేతలు నక్కాఆనంద్ బాబు, తెనాలి శ్రావణ కుమార్ పేర్కొన్నారు. బాధితురాలిపైనే కేసు పెట్టడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. చలో కంతేరుకు వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు. పంచాయతీ అనుమతి లేకుండానే వంగిపురంలో మట్టిని తవ్వుతున్నారని, అడిగినందుకు మహిళా సర్పంచిపై దాడి చేశారని గుర్తు చేశారు. తాము అధికారంలో ఉండగా ఏ రోజూ అక్రమాలకు పాల్పడలేదన్నారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తపుకుంటామని సవాల్ విసిరారు.  

Updated Date - 2022-06-14T01:08:12+05:30 IST