ltrScrptTheme3

వెంకీ, రానాల వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ షూటింగ్ ప్రారంభం..!

Oct 14 2021 @ 13:26PM

విక్టరీ వెంకటేష్, రానా కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌ను చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌ షూటింగ్ ప్రారంభమయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈరోజు (అక్టోబర్ 14) నుంచి షూటింగ్ మొదలైందని సమాచారం. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌ హిందీ, తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌ను 'ది ఫ్యామిలీ మ్యాన్', 'మీర్జాపూర్' వంటి సూపర్ హిట్ సిరీస్‌లను రూపొందించిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక గతంలో గతంలో బాబాయి - అబ్బాయి కలిసి క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలోని ఓ పాటలో సందడి చేసిన సంగతి తెలిసిందే. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.