రంగనాయక స్వామిగా వేణుగోపాలుడు

ABN , First Publish Date - 2021-03-02T06:31:09+05:30 IST

తర్లుపాడులో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి శేషవాహనంపై రంగనాయక స్వామి అవతారంలో వేణుగోపాలుడు భక్తులకు దర్శనమిచ్చారు.

రంగనాయక స్వామిగా వేణుగోపాలుడు
శేష వాహనంపై వేణుగోపాలుడు


తర్లుపాడు, మార్చి 1 : తర్లుపాడులో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి శేషవాహనంపై రంగనాయక స్వామి అవతారంలో వేణుగోపాలుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు కె.వి.రమణాచార్యులు, శ్రీమన్‌ చలమాచలం, చెన్నకేశవాచార్యులు, కూనపులి రమణయ్య శర్మ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీదేవి భూదేవి రంగనాయకుల స్వామి అవతారంలో వేణుగోపాలస్వామికి పురవీధులలో వైభవంగా భక్తులు గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారికి భక్తులు వార్లు పోసి కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉభయదాతలు వాడెల రామకోటేశ్వరరావు ధర్మపత్ని రాజ్యలక్ష్మీ, వాడెల సీతారామయ్య ధర్మపత్ని రాధమ్మ, వాడెల శివరావు ధర్మపత్ని లలితమ్మ, వాడెల రాజ్యలక్ష్మి, కుమారుడు కృష్ణప్రసాద్‌ ధర్మపత్ని మల్లేశ్వరి, వాడెల సువర్ణ, వాడెల మురళీబాబు ధర్మపత్ని సుబ్బమ్మ స్వామివారికి ప్రత్యేక పూజ కా ర్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి, ఆలయ ధర్మకర్త జవాజి విజయభాస్కరరావు, వివిధ వాహనాల ఉభయదాతలు, భక్తుల పాల్గొన్నారు. 



Updated Date - 2021-03-02T06:31:09+05:30 IST