మోదీ హయాంలోనే పెట్రోల్ రేట్లు తక్కువగా పెరిగాయి: కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2022-04-30T01:52:15+05:30 IST

మొన్న జరిగిన కొవిడ్-19 సమీక్ష సమావేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిపక్షాలు ముందుకు తెచ్చాయి. ధరల పెరుగుదలను బూచీగా చూపించి ప్రధాని మోదీని నిందించేందుకు ప్రయత్నిస్తున్నాయి’’ అని అన్నారు. అయితే ఈ రివ్యూ మీటింగ్‌లో పెట్రోల్..

మోదీ హయాంలోనే పెట్రోల్ రేట్లు తక్కువగా పెరిగాయి: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు అతి తక్కువగా పెరిగాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. పౌరుల జీవనోపాధి, సమాఖ్య వ్యవస్థకు మద్దతుగా తీసుకున్న నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. అయితే విపక్ష పార్టీలు పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధానమంత్రి మోదీని నిందించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘మొన్న జరిగిన కొవిడ్-19 సమీక్ష సమావేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిపక్షాలు ముందుకు తెచ్చాయి. ధరల పెరుగుదలను బూచీగా చూపించి ప్రధాని మోదీని నిందించేందుకు ప్రయత్నిస్తున్నాయి’’ అని అన్నారు. అయితే ఈ రివ్యూ మీటింగ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను రాష్ట్రాలు తగ్గించాలని మోదీ అన్నారు. ‘‘మోదీ హయాంలో పెట్రోల్ ధరలు కేవలం 30 శాతమే పెరిగాయి. 80 శాతం పెరిగినట్లుగా కొంత మంది రాద్దాంతం చేస్తున్నారు. దశాబ్ద కాలంలో జీతాలు అనేకం పెరిగాయి. దానికి తోడు అనేక ఉచిత పథకాల్ని ప్రభుత్వం అందిస్తోంది’’ అని హర్దీప్ సింగ్ అన్నారు.

Updated Date - 2022-04-30T01:52:15+05:30 IST