కమెడియన్‌గా ఎన్నో సినిమాలో నటించి, స్టార్ కమెడియన్‌గా గుర్తింపు పొందిన తర్వాత.. హీరోగా మారాడు సునీల్. టాలీవుడ్ తెరపై ఎన్నో మంచి మంచి పాత్రలలో ప్రేక్షకులను నవ్వించిన సునీల్.. హీరోగా రెండు మూడు హిట్స్ వచ్చినా.. వాటిని నిలబెట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ.. బాక్సాఫీస్ వద్ద పరాజయం చవిచూశాయి. ఇక చేసేది లేక.. మళ్లీ కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలో ఆయనకి ఆశించినంతగా పాత్రలు పడలేదు. ఇక కమెడియన్ రోల్స్ కోసం చూస్తున్న సునీల్‌కి.. అనుకోకుండా విలన్ అవకాశం తలుపు తట్టింది.
అయితే ఆయన విలనిజం ఇంకా కన్ఫ్యూజ్లోనే ఉంచేసరికి.. చేసేది లేక ఆయన ఇప్పుడో సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో సునీల్ మెగా ఫోన్ పట్టబోతున్నాడట. ఓ మరాఠా చిత్రం తనని ఎంతగానో ఆకర్షించడంతో.. ఆ సినిమా రైట్స్ తీసుకున్న సునీల్.. ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడనే వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే అన్నీ సెట్ చేశాడని.. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా దీనిపై రావచ్చనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే.. సునీల్ ఈ స్టెప్ ఎలా ఉండబోతోందో చూద్దాం.