అంగరంగ వైభవంగా పెళ్లి.. వధువుతో కలిసి కారులో ఇంటికొచ్చిన వరుడు.. కారు దిగగానే షాకింగ్ ఘటనతో ఆమెకు మైండ్‌బ్లాక్..!

ABN , First Publish Date - 2021-12-02T00:24:30+05:30 IST

బీహార్‌లో కూతురి పెళ్లి సందర్భంగా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. వధువుతో కలిసి వరుడు కూడా కారులో ఇంటికొచ్చాడు. ఇక పెళ్లే తరువాయి అనగా.. అంతా షాక్ అయ్యే ఘటన చోటుచేసుకుంది..

అంగరంగ వైభవంగా పెళ్లి.. వధువుతో కలిసి కారులో ఇంటికొచ్చిన వరుడు.. కారు దిగగానే షాకింగ్ ఘటనతో ఆమెకు మైండ్‌బ్లాక్..!
ప్రతీకాత్మక చిత్రం

కూతురికి మంచి సంబంధం చూసి, పెళ్లి చేసి.. అల్లుడు, కూతురు సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటే చూడాలని అందరి తల్లిదండ్రులకూ ఉంటుంది. అందుకోసమే ఒకటికి పదిసార్లు ఆలోచించి, ఎంతోమందిని విచారించి సంబంధం చూస్తారు. వారు ఊహించినట్లుగానే జరిగితే ఎంతో సంతోషిస్తారు. అయితే కొన్నిసార్లు మాత్రం తల్లిదండ్రుల ఆశలు.. అడియాశలవుతుంటాయి. బీహార్‌లో ఇలాగే కూతురి పెళ్లి సందర్భంగా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. వధువుతో కలిసి వరుడు కూడా కారులో ఇంటికొచ్చాడు. ఇక పెళ్లే తరువాయి అనగా.. అంతా షాక్ అయ్యే ఘటన చోటుచేసుకుంది..


బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా బెట్టియా పరిధి చరద్వాలి గ్రామానికి చెందిన చందేశ్వర్ గిరి ఏకైక కుమారుడు మనీష్ గిరికి, యోగాపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమేథియా గ్రామానికి చెందిన చందాతో పెళ్లి నిశ్చయమైంది. సోమవారం పెళ్లికుమార్తె ఇంటి వద్ద పెళ్లి ఉండడంతో తల్లిదండ్రులు.. ఏర్పాట్లు ఘనంగా చేశారు. వరుడు బంధువులకు ఏలోటూ రాకుండా.. సర్వం సిద్ధం చేశారు. మనీష్ ఊరేగింపుతో అమేథియా గ్రామానికి వచ్చాడు.


చరద్వాలి గ్రామానికి చెందిన చందేశ్వర్ గిరి ఏకైక కుమారుడు మనీష్ గిరి వివాహం యోగాపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమేథియా గ్రామానికి చెందిన చందాతో నిశ్చయమైంది. సోమవారం మనీష్ ఊరేగింపుతో అమేథియా గ్రామానికి వచ్చాడు. వధూవరులను చూడటానికి గ్రామస్తులంతా గుమికూడారు. జంట చూడముచ్చటగా ఉందంటూ అంతా మాట్లాడుకుంటుండగా.. అనుకోని ఘటన జరిగింది. అంతా చూస్తుండగా, ఒక్కసారిగా వరుడు కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో బ్యాండు సౌండ్లు, జనం అరుపులతో గోలగోలగా ఉన్న ఆ ప్రాంతం.. సడన్‌గా సైలెంట్ అయింది. నిద్ర తక్కువై కింద పడుంటాడు అనుకుని.. పెళ్లికొడుకు ముఖం మీద నీళ్లు చల్లారు. అయినా అతడు మాత్రం లేవలేదు.


వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పెళ్లికొడుకు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ వార్త వినగానే పెళ్లికూతురు తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలారు. మరోవైపు వధువు కూడా సొమ్మసిల్లి పడిపోవడంతో ఆమెనూ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటు కారణంగానే వరుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బంధువులు, స్నేహితులు, సన్నిహితులంతా.. అయ్యో ఏంటీ ఘోరం అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. వధువు కాళ్లకు పారాణి అయినా ఆరకముందే.. ఇలా జరగడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు.

Updated Date - 2021-12-02T00:24:30+05:30 IST