వ్యర్థాలతో కలాం విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2021-07-30T18:36:00+05:30 IST

కాదేది అనర్హం అన్న శ్రీశ్రీ సూక్తిని అనుసరించి పనికిరాని వస్తువులతో మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఎపిజె అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని బెంగళూరులో రూపకల్పన చేశారు. బెంగళూరు యశ్వం

వ్యర్థాలతో కలాం విగ్రహావిష్కరణ

బెంగళూరు: కాదేది అనర్హం అన్న శ్రీశ్రీ సూక్తిని అనుసరించి పనికిరాని వస్తువులతో మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఎపిజె అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని బెంగళూరులో రూపకల్పన చేశారు. బెంగళూరు యశ్వంతపురం రైల్వే స్టేషన్‌లో 800 కిలోలకు పైగా పనికిరాని ఇనుప, ఇత్తడి వస్తువులను వినియోగించి 45 రోజుల పాటు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. యశ్వంతపురం కోచింగ్‌ డిపోకు చెందిన ఇంజనీర్లు సీపీ శ్రీధర్‌, శ్రీనివాసరాజులు ఎంతో శ్రద్ద తీసుకొని దీనికి రూపకల్పన చేసినట్లు నైరుతి రైల్వే బెంగళూరు డివిజన్‌ ప్రకటించింది. మైసూరు రైల్వే వర్క్‌షాప్‌ నుంచి నట్లు, బో ల్టులు మెటాలిక్‌ రోప్‌లు డ్యాంపర్లు వంటివాటిని సేకరించి ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌ సహకారంతో రూపొందించిన ఈ కలాం అపురూప విగ్రహానికి రూ. 3 వేలు ఖర్చయినట్లు ప్రకటన పేర్కొంది. మేక్‌ ఇన్‌ ఇండియా పరికల్పనకు స్ఫూర్తి చెందిన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని యశ్వంతపురం రైల్వే ప్రయాణీకులకు ఇదొక ప్రధాన ఆకర్షణ కానుందని ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-07-30T18:36:00+05:30 IST